ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజల బాగు కోసమేనని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకే లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే పర్యటించారు.
'ప్రజలను కాపాడుకునేందుకే లాక్డౌన్ నిర్ణయం' - latest news on mla kale yadaiah says Lockdown decision is for protect the people
కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
'ప్రజలను కాపాడుకునేందుకే లాక్డౌన్ నిర్ణయం'
ఈ సందర్భంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి.. కరోనాను అరికడదామని తెలిపారు.