తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్లలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - independence day 2020

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చేవెళ్లలోని ప్రజాప్రతినిధి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.

క్యాంప్ ఆఫీస్​లో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే కాల యాదయ్య
క్యాంప్ ఆఫీస్​లో జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే కాల యాదయ్య

By

Published : Aug 15, 2020, 6:24 PM IST

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రజాప్రతినిధి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. క్యాంపు కార్యాలయం వద్ద శాసనసభ్యుడు కాల యాదయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

చేవెళ్ల పరిధిలోని సహాయ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వద్ద ఏసీపీ రవీందర్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ విజయలక్ష్మి, మండల రెవెన్యూ ఆఫీస్ వద్ద తహసీల్దార్ షర్మిళ జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇవీ చూడండి : గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం.. జలదిగ్బంధంలో దేవీపట్నం

ABOUT THE AUTHOR

...view details