టీబీని ముందస్తుగా గుర్తించడంతోనే ఆ వ్యాధిని పూర్తిగా అంతమొందించవచ్చని.. అవేర్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో.. ఆస్పత్రి నుంచి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వరకు 3కె అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
ముందుగా గుర్తిస్తే టీబీని అంతమొందించొచ్చు: సుధీర్ రెడ్డి - world tb day
ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్బీ నగర్‌లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో..ఎల్బీ నగర్ నుంచి సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
టీబీ వ్యాధి నివారణకు నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్‌తో కలిసి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2025 వరకు టీబీ వ్యాధిని పూర్తి స్థాయిలో అంతమొందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వరుసగా రెండు వారాలు దగ్గు లేదా ఆయాసం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే తక్షణమే టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా వ్యాధి ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సుధీర్ రెడ్డి వివరించారు.
ఇదీ చూడండి :3కె ఫ్రీడం రన్‌ను ప్రారంభించిన సీఎస్, డీజీపీ