శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ డివిజన్ తులసీనగర్ కాలనీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. కార్పోరేటర్లు వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పల పాటి శ్రీకాంత్తో కలిసి పనులు ప్రారంభించారు.
ఆల్విన్ డివిజన్లో 2కోట్లతో పనులకు శంకుస్థాపన - Sherilingampally Constituency Alvin Division Latest News
ఆల్విన్ డివిజన్ తులసీనగర్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను ప్రారంభించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

తులసీనగర్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన
2కోట్ల 38లక్షల 50వేల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు మొదలు పెట్టారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా బాధ్యత తీసుకుంటానని ప్రజలకు గాంధీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.