తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరికెపూడి - నిత్యావసరాల పంపిణీ

కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సూచించారు. లాక్​డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన బ్రాహ్మణులకు ఎమ్మెల్యే నిత్యావసరాలను పంపిణీ చేశారు.

rangareddy district latest news
rangareddy district latest news

By

Published : May 27, 2020, 5:24 PM IST

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్​నగర్​లో స్థానిక డివిజన్​ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హాజరై... 200 మంది నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు, పండ్లు, హెల్త్ కిట్లను అందజేశారు.

డివిజన్ పరిధిలో ఎవరైన ఇబ్బందులు పడుతున్నవారు ఉంటే స్థానిక నాయకులు తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. స్వయంగా వారి సమస్యలను తొలగించేందుకు వీలైనంత మేరకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details