తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారు: మియాపూర్ అభ్యర్థి - రంగారెడ్డి జిల్లాతాజా వార్తలు

తెరాస చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమకు విజయాన్ని చేకూర్చుతాయని మియాపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

miyapur-trs-candidate-election-campaign in hyderabad
తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారు: మియాపూర్ అభ్యర్థి

By

Published : Nov 24, 2020, 8:06 AM IST

తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మియాపూర్ తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. తాము భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని... వాటిని తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇది వరకు చేసిన అభివృద్ది పనులే తమకు విజయాన్ని చేకూర్చుతాయని ఆయన అన్నారు. కాలనీల్లో 90 శాతం రోడ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.128కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

పేదవారికి ఇచ్చే వరద సాయాన్ని ఇతర పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలు అయిపోగానే వరద బాధితులకు సాయం అందజేస్తామని మంత్రి కేటీఆర్ ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. తెరాస మేనిఫెస్టో చాలా సంతృప్తికరంగా ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్​లో నిధుల కొరతకు తావు లేదని అభిప్రాయపడ్డారు.

తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారు: మియాపూర్ అభ్యర్థి

ఇదీ చదవండి:ఆకర్షణీయ హామీలతో తెరాస జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో

ABOUT THE AUTHOR

...view details