రాష్ట్రంలో మామిడి సీజన్ దృష్ట్యా రైతుల సౌకర్యార్థం... కొహెడ మార్కెట్‌ను సిద్ధం చేశామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ శివారు హయత్‌నగర్ మండలం కొహెడలో ఏర్పాటు చేస్తున్న మార్కెట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, గడ్డిఅన్నారం ఏఎంసీ ఛైర్మన్ రామ్ నర్సింహగౌడ్, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కొహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రులు - Ministers visit koheda market
రంగారెడ్డి జిల్లా కొహెడలో ఎల్లుండి నుంచి పండ్ల క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి. పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.
కొహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రులు
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపులో భాగంగా కొహెడలో మామిడి క్రయ, విక్రయాల ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఏర్పాట్లపై రైతులు, కమీషన్ ఏజెంట్లతో మాట్లాడి.. అభిప్రాయాలు స్వీకరించారు. అధికారికంగా మూడు రోజుల్లో కొహెడ మార్కెట్‌లో మామిడి క్రయ, విక్రయాలు ప్రారంభిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతులు, ఏజెంట్లు, సహాయకుల కోసం క్యాంటిన్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ఇవీ చూడండి: కరోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు
Last Updated : Apr 28, 2020, 2:31 PM IST