తెలంగాణ

telangana

ETV Bharat / state

NEW RATION CARDS: రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. - telangana 2021 news

సర్కారు నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు నూతన కార్డులను అందజేశారు.పేద ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా... ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన ఆహర భద్రతా కార్డులను ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.

ministers-and-mlas-distributed-new-ration-cards-in-telangana
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

By

Published : Jul 26, 2021, 1:35 PM IST

పేదలకు ఆహర భద్రతలో భాగంగా అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్‌ కార్డులను జారీ చేసింది. అంందులో భాగంగానే వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లబ్ధిదారులకు నూతన కార్డులను అందజేశారు. రాయపర్తి మండల పరిధిలోని 374 మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. త్వరలోనే కొత్త పింఛన్లను ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొంచం ఆలస్యమైనా అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయం..

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్, మేడిపల్లి, కీసర మండలాల్లో నూతన రేషన్ కార్డుదారులకు మంజూరు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఐదు వందల కుటుంబాలకు ఒక రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హెచ్​ఎమ్​టీ సొసైటీలో కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ లబ్ధిదారులకు అందజేశారు.

56 వేల ఆహారభద్రత కార్డులు మంజూరు..

హైదరాబాద్‌ బేగంపేటలోని జోరాస్టిన్ క్లబ్‌లో పేదలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు.పేదలు ఆకలితో అలమటించవద్దనే ఉద్దేశంతోనే... ప్రభుత్వం వారికి రేషన్ కార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. కొత్తగా 56 వేల ఆహారభద్రత కార్డులు మంజూరు చేసినట్లు తలసాని స్పష్టం చేశారు. ప్రతి మనిషికి ఆహార భద్రత కార్డ్ ద్వారా 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉన్న సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి పేద ప్రజలకు లబ్ది చేకూర్చినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:Lashkar Bonalu : 'ఆపదలో నా భక్తుల వెంటే ఉంటాను'

ABOUT THE AUTHOR

...view details