తెలంగాణ

telangana

ETV Bharat / state

National Handball Championship: 'త్వరలోనే హైదరాబాద్ వేదికగా మినీ ఒలింపిక్స్' - జాతీయ మహిళల హ్యాండ్​బాల్ పోటీలు

National Handball Championship: రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్​ సరూర్​నగర్​ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ సీనియర్​ మహిళల హ్యాండ్​బాల్ ఫైనల్​ మ్యాచ్​ను తిలకించారు. హైదరాబాద్ వేదికగా త్వరలోనే మినీ ఒలింపిక్స్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

National Handball Championship
జాతీయ సీనియర్​ మహిళల హ్యాండ్​బాల్ పోటీలు

By

Published : Apr 3, 2022, 2:38 PM IST

National Handball Championship: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణస్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం ఇస్తోందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పష్టంచేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్-2022 ఫైనల్‌ పోటీలకు శ్రీనివాస్‌ గౌడ్​తో పాటు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌-రైల్వేస్‌ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను తిలకించారు. అనంతరం విజేత, రన్నరప్ జట్లకు బహుమతులు అందించారు. క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి.. త్వరలోనే హైదరాబాద్ వేదికగా మినీ ఒలింపిక్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే జిల్లాల్లో నూతన స్టేడియాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత రెండేళ్లగా నగరంలో అంతర్జాతీయ స్థాయిలో హ్యాండ్​బాల్ పోటీలు నిర్వహిస్తున్న జగన్​ మోహన్ రావును మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని జాతీయ హ్యాండ్ బాల్ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు అన్నారు.

జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్-2022

విజేత హిమాచల్ ప్రదేశ్.. మూడోస్థానంలో తెలంగాణ:సరూర్​నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ ఛాంపియన్​షిప్ -2022 టైటిల్​ను హిమాచల్​ప్రదేశ్ కైవసం చేసుకుంది. ఫైనల్​లో హిమాచల్ 20-10 తేడాతో రైల్వేస్ జట్టుపై నెగ్గింది. ఈ పోటీల్లో తెలంగాణ జట్టు మూడోస్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో శాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్ పాండే పాల్గొన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ క్రీడలపై ఆసక్తి పెంచుతున్నాం. ప్రత్యేకంగా ఉద్యోగాలలో 2 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇదంతా జరుగుతోంది. ఎడ్యుకేషన్​లో రిజర్వేషన్లు ఇస్తున్నాం. క్రీడల్లో సీట్ల కోసం పోటీ పెరిగింది. అప్పట్లో సీట్లు మిగిలిపోయేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. - శ్రీనివాస్ గౌడ్, క్రీడాశాఖ మంత్రి

జాతీయ సీనియర్​ మహిళల హ్యాండ్​బాల్ పోటీలు

ఇదీ చూడండి:ఏడోసారి ప్రపంచకప్​ నెగ్గిన ఆసీస్​.. ఫైనల్లో ఇంగ్లాండ్​ చిత్తు

ABOUT THE AUTHOR

...view details