ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'బాలలు పొరపాట్లు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడవాలి' - సైదాబాద్​లో బాలల దినోత్సవం

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సైదాబాద్​లోని ప్రభుత్వ బాలుర హోమ్​లో నిర్వహించిన వేడుకలకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పిల్లలతో కలిసి సరదాగా గడిపారు. మంచి మార్గంలో నడిచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని బాలలకు సూచించారు.

minister sathyavathi
'బాలలు పొరపాట్లు సరిదిద్దుకొని మంచి మార్గంలో నడవాలి'
author img

By

Published : Nov 14, 2020, 6:43 PM IST

జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా సైదాబాద్​లోని ప్రభుత్వ బాలుర హోమ్​లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాఠోడ్​ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.

మంచి మార్గంలో

చిన్నతనంలో అందరూ తెలిసీ తెలియక తప్పులు చేయటం సహజమని, వాటిని సరిదిద్దుకుని మంచి మార్గంలో నడవాలని బాలలకు సత్యవతి సూచించారు. అలాంటి వారే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు. అనాథ విద్యార్థులకు, వసతి గృహాల్లో ఉంటున్న వారికి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు.

బాలల దినోత్సవంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ కార్యక్రమంలో సెక్రటరీ, శ్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, హోమ్ డైరెక్టర్ శైలజ, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:మియాపూర్​ రిలయన్స్​ డిజిటల్​లో భారీ చోరీ.. షోరూం మూసివేత

ABOUT THE AUTHOR

...view details