జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేస్తారని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. బల్దియాపై తెరాస గులాబీ జెండా ఎగర వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చిలుకానగర్ డివిజన్ తెరాస అభ్యర్థి పన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్‌కు మద్దుతుగా మంత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 20 వేల లీటర్ల నీటిని ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని, నీటి పన్ను వసూలు చేయమని సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. చిరు వ్యాపారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు లబ్ధి చేకూరేలా సెలూన్లకి, ఇస్త్రీ షాపులకు ఉచిత కరెంట్ కల్పిస్తామని వెల్లడించారు. దోబీఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు, చిన్న పరిశ్రమలకు 50 శాతం పన్ను రద్దు చేస్తామన్నారు.
'వరద సాయం అందితే డిపాజిట్లు కూడా దక్కవని ఆపివేయించారు' - జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రచారం
బల్దియాపై తెరాస గులాబీ జెండా తప్పక ఎగరవేస్తుందని మంత్రి సత్యవతి రాఠోడ్ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తారని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా చిలుకానగర్ డివిజన్లో అభ్యర్థి పన్నాల గీతకి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
'వరద సాయం అందితే డిపాజిట్లు కూడా దక్కవని ఆపివేయించారు'
నగరంలో వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకునేందుకు సీఎం రూ. పదివేల సాయం ప్రకటించారు. సాయం అందుకున్నవారు తెరాసకి ఓటు వేస్తే ఎన్నికల్లో తమకు కనీసం డిపాజిట్లు కూడా రావని వరద సాయాన్ని భాజాపా ఆపివేయించిందని మంత్రి ఆరోపించారు.
ఇదీ చదవండి:హైదరాబాద్‌కు చేరుకున్న జేపీ నడ్డా.. రాష్ట్ర నాయకుల ఘనస్వాగతం