రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధికేసీతండాలోనీ కస్తూర్బా పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. కొవిడ్ మార్గదర్శకాల అమలు వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించిన మంత్రి సబిత విద్యార్థులతో ముచ్చటించారు.
'శానిటైజర్, మాస్క్ తప్పనిసరి... భౌతికదూరం పాటించండి' - కరోనా మార్గదర్శకాల అమలుపై ఆరా తీసిన మంత్రి
కేసీతండాలోనీ కస్తూర్బా పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. కొవిడ్ మార్గదర్శకాల అమలు వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరన్నారు.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సబిత
కరోనాకు భయపడకుండా జాగ్రత్తలతో నివారించాలని సూచించారు. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరన్నారు. రెండు రోజులుగా 70 శాతం వరకు విద్యార్థులు అనుమతి పత్రాలతో హాజరవుతున్నారని.. త్వరలోనే 100 శాతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: శేషాద్రి కుటుంబానికి మంత్రి ఈటల పరామర్శ