గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుపోతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలో పర్యటించారు. కాలనీల్లో నడుచుకుంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
పట్టణాలు, గ్రామాలు రెండు కళ్లుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో... దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం ప్రతి నెల రూ. 339 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న తండాలను నూతన పంచాయతీలుగా మార్చామని పేర్కొన్నారు.