ఆన్లైన్ తరగతుల పాఠాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రాథమిక పాఠశాలను ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు.
అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడగండి : సబిత - rangareddy news
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పాఠాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులను అడగండి : సబితా
జాగ్రత్తలు తీసుకుంటూనే విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని తెలిపారు. కరోనా పరిస్థితుల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులు, అధికారులు తోడ్పాటును అందిచాలని మంత్రి కోరారు.