రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మహిళలకు మంత్రి చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం 317 కోట్లు ఖర్చు చేసి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు.
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి సబిత - bathukamma festival 2020
గత ఏడాది కంటే ఎక్కువ డిజైన్లతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
గత ఏడాది కంటే ఈసారి మంత్రి కేటీఆర్ చొరవతో మంచి నాణ్యతతో కూడిన 287 డిజైన్ల చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఏటా దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆడపడుచులకు సర్కారు కానుకలు ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇతర ఏ రాష్ట్రాల్లో లేవని మంత్రి సబిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాది, కౌన్సిలర్లు, తెరాస నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహిళలకు, నేతన్నలకోసమే.. బతుకమ్మ చీరలు : మంత్రి సత్యవతి రాఠోడ్