రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో రాత్రి కురిసిన వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లెనిన్ నగర్ కాలనీ మొత్తం నీట మునగడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించారు.
నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన - లోతట్టుప్రాంతాలను పరిశీలించిన మంత్రి సబితా
ఆగకుండా కురిసిన వర్షానికి రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో లెనిన్‌నగర్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.ఈ మేరకు కాలనీ సమస్యలను తెలుసుకోవడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లెనిన్‌నగర్‌లో పర్యటించారు.
నీట మునిగిన ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలన
కాలనీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని.. ప్రస్తుతం ఇళ్లన్నీ ఖాళీ చేసి అందర పాఠశాల భవనాలకు, కమ్యూనిటీ భవనాలకు మారాలని అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అధిక వర్షపాతం వల్ల ముంపునకు గురైన కాలనీల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం