చెరువులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. చెరువులు కబ్జాకు గురికాకుండా రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలికలోని బర్హాన్ ఖాన్ చెరువు చుట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా చేపట్టిన పనులను ఆమె పరిశీలించారు. ఇందుకోసం ప్రత్కేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. చెరువులన్నీ డ్రైనేజీతో నిండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉస్మాన్ సాగర్ చెరువుకట్టను బలోపేతం చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఉస్మాన్ సాగర్, జల్పల్లి రువులను సుందరీకరిస్తాం
గత వర్షకాలంలో ఉస్మాన్ సాగర్ ముంపునకు గురై ప్రజలు చాలా ఇబందులు పడ్డారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పూర్తి పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. చెరువులకు రూ.21లక్షలు మంజూరు చేయడంతో పాటు బర్హాన్ ఖాన్ చెరువు కట్ట ఎత్తు పెంచి మరమ్మత్తులు చేస్తామని మంత్రి తెలిపారు. ఉస్మాన్ నగర్ ప్రాంతలోని బర్హాన్ ఖాన్ చెరువు, జల్పల్లి పెద్దచెరువు సుందరీకరణ పనులకు మరో రూ.20 లక్షలు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. అనంతరం శ్రీ రాంకాలనీ ప్రాంతంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటాం