తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్​పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబిత పర్యటన - jalpally municipality latest news

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. పలు కాలనీల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గతేడాది వర్షాలు మిగిల్చిన చేదు అనుభవాలు భవిష్యత్​లో ఎదురవకుండా... అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

minister sabitha indra reddy visited in jalpally municipality
జల్పల్లి మున్సిపాలిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

By

Published : Jan 9, 2021, 5:09 PM IST

రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరాం కాలనీ, షాహీన్​నగర్, బిస్మిల్లా కాలనీలో రూ.72 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ, రహదారి అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. గతేడాది కురిసిన వర్షాలకు జల్​పల్లి మున్సిపాలిటీలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయన్న మంత్రి... అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రోడ్లు, డైనేజీలకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

రూ. 2 కోట్లతో కొత్తపేట్- ఉస్మాన్​నగర్ మెయిన్ రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. ప్రజలెవరూ రోడ్డుపై చెత్త వేయవద్దని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాది, వైస్ ఛైర్మన్, స్థానిక కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కాళేశ్వరం గుత్తేదారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ABOUT THE AUTHOR

...view details