తెలంగాణ

telangana

ETV Bharat / state

కౌకుంట్ల గ్రామంలో మంత్రి సబిత పర్యటన - రంగారెడ్డి జిల్లా తాజా వార్త

రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని, పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

minister sabitha indra reddy visit kowkuntla village in rangareddy district
కౌకుంట్ల గ్రామంలో మంత్రి సబిత పర్యటన

By

Published : Aug 2, 2020, 7:20 PM IST

రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల గ్రామంలోని పలు అభివృద్ధి పనులను విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. చేవెళ్ల శాసన సభ్యులు కాలే యాదయ్యతో కలిసి గ్రామంలో పర్యటించారు. పాఠశాల వద్ద చెపట్టాల్సిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సర్పంచ్​ను ఆదేశించారు. పాఠశాలను దత్తత తీసుకోవాలని, అన్ని రకాలుగా గ్రామాన్ని అభివృద్ధి పరచాలని గ్రామ కో-ఆప్షన్ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ మల్లారెడ్డికి మంత్రి సూచించారు.

హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని చుట్టూ మూడు వరుసలలో మొక్కలు నాటాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. వివిధ కమీటీ సభ్యులను వారి విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వనానికి సంబందించి స్థలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించాలన్నారు. త్వరలో తాను మళ్లీ వస్తానని పనులు అప్పటిలోగా పనులను పూర్తిచేయాలని మంత్రి సబితా ఆదేశించారు.

ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details