తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి - Rangareddy District Chevella

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఎన్కపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్​ విగ్రహాలను మంత్రి సబితా రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్యలు కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నట్లు మంత్రి గుర్తుచేశారు.

minister sabita, chevella news today
అంబేడ్కర్​ విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి

By

Published : Apr 10, 2021, 5:21 PM IST

అందరూ చదువుకున్నప్పుడే సమాజంలో మార్పు, అభివృద్ధి సాధ్యం అవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం వెంకిపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కాల యాదయ్యతో కలిసి ఆమె అంబేడ్కర్​ విగ్రహాలను ఆవిష్కరించారు.

అంబేడ్కర్​ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వివిధ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాజ్యంగ ఫలాలు సామాన్యులందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్​ప్లాన్ కోసం రూ.1000 కోట్ల కేటాయింపు సహకారం అందిస్తున్నట్లు ఆమె వివరించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి తెలియజేశారు.

ఇదీ చూడండి :హైదరాబాద్‌లో వ్యాపారుల స్వచ్ఛంద బంద్

ABOUT THE AUTHOR

...view details