ఇంటింటికీ నల్లా నీరు అందివ్వడమే ముఖ్యమంత్రి లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వంద గజాల లోపు ఇళ్లు ఉన్నవారికి కేవలం ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పురపాలికలో మిషన్ భగీరథ ట్యాంకులను ఆమె ప్రారంభించారు.
ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వడమే లక్ష్యం: సబిత - మిషన్ భగీరథ రిజర్వాయర్లను ప్రారంభించిన మంత్రి సబితా
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి పురపాలికలో మిషన్ భగీరథ ట్యాంకులను ఆమె ప్రారంభించారు.
మిషన్ భగీరథ ట్యాంకులను ప్రారంభించిన మంత్రి సబితా
మున్సిపాలిటీలోని ఎర్రకుంట, సదాత్ నగర్, బిస్మిల్లా కాలనీలో మంత్రి పర్యటించారు. జల్‌పల్లి పురపాలిక ప్రజల కోసం రూ.27 కోట్లతో 146 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 5 రిజర్వాయర్లు నిర్మించినట్లు తెలిపారు. బిస్మిల్లాహ్ కాలనీలో రూ.కోటి 30 లక్షలతో మరిన్ని పనులు చేపడుతున్నట్లు సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, వాటర్ వర్క్స్ అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.