రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాల యాదయ్య, సంయుక్త కలెక్టర్ హరీష్‌తో కలిసి... వివిధ శాఖల అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
'వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు' - మంత్రి సబితా ఇంద్రారెడ్డి వార్తలు
గతంలో కంటే ఈ ఏడాది పంట దిగుబడులు అధిక స్థాయిలో వచ్చాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. చేవేళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
'వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు'
గతంలో కంటే ఈ ఏడాది పంట దిగుబడులు బాగా పెరిగాయని... సాగునీటి ప్రాజెక్టులు, కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్లే ఇది సాధ్యమైందని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవీచూడండి:ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు