తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే: సబితా ఇంద్రారెడ్డి - CORONA UPDATES

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

MINISTER SABITHA INDRA REDDY MEETING ON CORONA UPDATES
'అధికారులే మీ ఇళ్లకు సరుకులు తెస్తారు'

By

Published : Apr 12, 2020, 7:57 PM IST

నిబంధనలు ఉల్లఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపల్ కార్యాలయంలో వైద్య, పోలీస్​ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేదవారికి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన పనులు, పేదల అవసరాలు తదితర అంశాలపై చర్చించారు.

రెడ్​క్లస్టర్లలో ఉన్న ప్రాంత ప్రజలందరూ ఇళ్లను వదిలి బయటికి రావద్దని సూచించారు. నిత్యావసర సరుకులు అధికారులే ఇంటికి చేరుస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా మాస్కులు తప్పని సరిగా ధరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:ఈ ఏడాది చివరి వరకు వృద్ధులంతా క్వారం​టైన్​లోనే!

ABOUT THE AUTHOR

...view details