రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఏడు కోట్ల 50లక్షల వ్యయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
జన్వాడ, గోపులారం, సంకేపల్లి గ్రామాల్లో పంచాయతీ భవనాల పనులు ప్రారంభించారు. మోకీలలో రైతువేదిక భవనం, పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.