వరద బాధితులకు అండగా ఉంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నష్టపోయిన వాళ్లందరికీ రూ.10వేల రూపాయల సాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లోగా అందరికీ సహాయం అందుంతుందని... ఎవరికైనా సహాయం అందకపోతే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
వరద సమస్యకు శాశ్వత పరిష్కారం: మంత్రి సబితా - మీర్పేట వరద బాధితులు
వరదల కారణంగా నష్టపోయిన అందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో కలిసి ఆమె మీర్పేట్లో పర్యటించారు.
త్వరలోనే ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుంది: సబితా
ఈ విపత్తును ఎవరూ ఊహించలేదని... ప్రస్తుతం ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసేలా కృషి చేస్తోందంటున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి:అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్