ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
'పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలి' - రంగారెడ్డి జిల్లాలో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
'పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగలా నిర్వహించాలి'
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండగలా నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు సూచించారు. తెరాస ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఇదీ చదవండి:అప్పుడు కరోనా.. ఇప్పుడు మౌఢ్యం