తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ సమయంలో రాజకీయాలు వెతక్కండి: సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలో వర్షానికి ముంపునకు గురైన కాలనీలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. జేసీబీల సాయంతో కాలువలు ఏర్పాటు చేసి నీటిని తొలగించేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి ఉందని వాటి విషయంలో రాజకీయాలు వెతకొద్దని కోరారు.

Minister Sabitha Indra Reddy asked not to look for politics
రాజకీయాలు వెతకొద్దని కోరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

By

Published : Oct 28, 2020, 4:13 PM IST

Updated : Oct 28, 2020, 4:30 PM IST

రాజకీయాలు వెతకొద్దని కోరిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ ప్రాంతాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ముంపు ప్రాంతాల నుంచి నీటిని బయటకు పంపే దిశగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ తీసుకున్నారు. బర్హాన్​ఖాన్ చెరువు నుంచి జేసిబీలతో ఓ కాలువ ఏర్పాటు చేసి నీటిని బయటకు వదులుతున్నారు. వరద బాధితులు, స్థానికులతో మంత్రి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు చేపడుతున్నామని ఆమె అన్నారు.

వరద సమస్య వేగవంతంగా పరిష్కరించడం కోసం సీఎస్​, కలెక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని మంత్రి చెప్పారు. అన్ని చెరువుల ఎఫ్​టీఎల్​ ఫిక్స్ చేస్తున్నామని, భవిషత్తులో ఎఫ్​టీఎల్​ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్ని ముంపు ప్రాంతాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ మజర్, పలువురు తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

Last Updated : Oct 28, 2020, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details