తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Sabitha: ఫీవర్ సర్వేతో కరోనాను కట్టడి చేయగలిగాం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha) మహేశ్వరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్​కే పురంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతోనే కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

By

Published : Jun 24, 2021, 3:39 PM IST

minister sabitha
మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha) పర్యటించారు. ఆర్​కే పురంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Urban Primary Health Center) ఆమె ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు మంచి వైద్యం అందించాలనే సంకల్పంతోనే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మంత్రి

పేదలకు మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం(CM Kcr) సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల(Super‌ specialty hospitals) నిర్మాణానికి పూనుకున్నారు. సౌకర్యాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలి. రాష్ట్రంలోని పలు నగరాల్లో మరిన్ని ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువస్తాం. రాష్ట్రంలో ఫీవర్ సర్వే(Fever Survey)తో కరోనాను కట్టడి చేయగలిగాం. తెలంగాణను ఆదర్శంగా తీసుకున్న పలు రాష్ట్రాలు.. ఆయా రాష్ట్రల్లో ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నాయి.

- సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో ఆర్‌కే పురం డివిజన్ అధ్యక్షుడు అరవింద్ శర్మ, భాజపా కార్పోరేటర్ రాధా ధీరజ్‌ రెడ్డి, తెరాస, భాజపా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:VACCINATION: 'ఒకట్రెండు రోజుల్లో కోటి మార్క్‌కి వ్యాక్సినేషన్'

ABOUT THE AUTHOR

...view details