కొవిడ్ టీకా.. దశలవారీగా అందరికీ వేస్తాం: మంత్రి సబిత
రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. తొలి టీకాను ఆరోగ్య కార్యకర్త జయమ్మకు వేశారు. తొలిటీకా తాను తీసుకోవటంపై జయమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన మంత్రి సబిత
రంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్‌ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. నార్సింగ్ ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్త జయమ్మకు తొలిటీకా వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న జయమ్మకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. అన్ని వర్గాలకు టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తొలిటీకా తాను తీసుకోవటంపై ఆరోగ్య కార్యకర్త జయమ్మ ఆనందం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి :గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం