రంగారెడ్డి జల్పల్లి మున్సిపాలిటీ ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. భారీ వర్షానికి ఉస్మాన్‌నగర్, నబీల్ కాలనీ, బుర్హాన్‌ఖాన్ చెరువు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు. ముంపు సమస్యలు పునరావృతం కాకుండా త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
'ముంపు ప్రాంత ప్రజల సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం' - heavy flood in rangareddy district
వరదలు వచ్చిన ప్రతిసారి ముంపునకు గురయ్యే ప్రాంతాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో ముంపునకు గురైన ప్రాంతాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పర్యటించారు.
జల్పల్లి పురపాలికలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన
గొలుసు కట్టు చెరువులున్న బాలాపూర్ మండలంలో చెరువుల మధ్య అక్రమ కట్టడాలు కట్టడం వల్లే వరద నీరు వెళ్లడానికి వీలులేక తమ ప్రాంతాలు నీటిలో మునిగాయని స్థానికులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి విన్నవించారు. బుర్హాన్‌ఖాన్ చెరువును పరిశీలించిన మంత్రి.. చెరువు కట్ట తెగిందని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల చెరువు కట్ట కింది ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని సూచించారు.
- ఇదీ చదవండి :జలదిగ్బంధంలోనే హైదరాబాద్ శివార్లలోని కాలనీలు