తెలంగాణ

telangana

ETV Bharat / state

గరిగుట్ట పెద్దమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలినలో మంత్రి తనయుడు

జల్​పల్లి మున్సిపాలిటీలోని గరిగుట్ట పెద్దమ్మ జాతర ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి పరిశీలించారు. మంత్రి ఆదేశాలతో దేవస్థానం పనులపై అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు ముడు రోజుల పాటు జరగనున్నాయి.

Minister Sabita Indrareddy's son in charge of Garigutta Paddamma Jatara arrangements
గరిగుట్ట పెద్దమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలినలో మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు

By

Published : Feb 6, 2021, 6:41 AM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలి మాదన్న గూడ అటవీ ప్రాంతంలోని గరిగుట్ట ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కౌశిక్ రెడ్డి పరిశీలించారు. మంత్రి ఆదేశాలతో దేవస్థానం పనులపై అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి.

మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, పహడి షరీఫ్ సీఐ విష్ణు వర్ధన్ రెడ్డి, ఆలయ పూజారి విట్టల్ బాబను అడిగి పనుల గురించి కౌశిక్​ రెడ్డి తెలుసుకున్నారు. జాతరకు సంబంధించి రోడ్డు మరమ్మతు, తాగు నీటి సౌకర్యం కల్పించామని కమిషనర్ తెలిపారు.

పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాలు జరగనున్న మూడు రోజులు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కార్యక్రమంలో జల్​పల్లి కౌన్సిలర్ బుడమల యాదగిరి, కో ఆప్షన్ మెంబర్ సుర్రెడ్డి కృష్ణ రెడ్డి, మున్సిపాలిటీ తెరాస అధ్యక్షుడు ఇక్బాల్ బిన్ ఖలీఫా, నాయకులు జనార్దన్, కొండల్ యాదవ్, భాజపా నేత శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఆ పంటలను ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుంది'

ABOUT THE AUTHOR

...view details