అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్ది జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని అల్మాస్ గూడాలో రూ.1.49 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పాలన: మంత్రి సబితా - telangana news
అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్ది జిల్లా అల్మాస్ గూడాలోని 26వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పాలన: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మధురపూరి కాలనీ, శ్రీ హిల్స్ కాలనీ, తిరుమల నగర్లో బీటీ రోడ్డు, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బడాంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'అలా ఔట్ అవ్వడం దురదృష్టకరం'