పాఠ్య పుస్తకాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్లలో 30 లక్షల రూపాయల జడ్పీ నిధులతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే... పాఠ్య పుస్తకాల పంపిణీలో గౌరవ శాసన సభ్యులు, ఎంపీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లు, విద్యా కమిటీ ఛైర్మన్లు తదితరులు పాల్గొని పంపిణీ చేయాలని సూచించారు.
ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే పంపిణీ కోసం ఇప్పటికే పుస్తకాలను ప్రధానోపాధ్యాలకు, విద్యా కమిటీలకు అప్పజెప్పినట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.