తెలంగాణ

telangana

By

Published : Jan 12, 2021, 8:36 PM IST

ETV Bharat / state

దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్​రెడ్డి

కేంద్ర వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. రైతుల ఆందోళనలు గమనించిన కోర్టు... కేంద్రాన్ని రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలని ఆదేశించిందని తెలిపారు.

దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్​రెడ్డి
దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్​రెడ్డి

సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ వేదికగా రైతు సంఘాల ఆందోళనల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు దేశ రైతులు సాధించిన పాక్షిక విజయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం పట్ల మంత్రి స్పందించారు. రైతుల ఆందోళనలు గమనించిన సుప్రీంకోర్టు... కేంద్రాన్ని రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలని ఆదేశించిందని తెలిపారు.

దేశ రైతులు సాధించిన పాక్షిక విజయం: నిరంజన్​రెడ్డి

పరిష్కారం మీరు చూపుతారా? మమ్మల్ని జోక్యం చేసుకోమంటారా? అని ప్రశ్నించిందని గుర్తు చేశారు. కేంద్రం తీరు పరిశీలించిన సుప్రీం... కేంద్ర వ్యవసాయ చట్టాలపై స్టే విధించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. వ్యవసాయ చట్టాలపై సమీక్షకు నిపుణుల కమిటీ వేయడం ఆహ్వానించదగ్గ తరుణమని సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.

సుప్రీం నిపుణుల కమిటీలో కేంద్రమే కాకుండా రైతు సంఘాలు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ అన్ని రాష్ట్రాల అభ్యర్థనలు స్వీకరిస్తే ప్రజాస్వామ్యబద్ధ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ: రైతులు

ABOUT THE AUTHOR

...view details