రంగారెడ్డి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ఈసీఐఎల్ నుంచి నాగారం వరకు జరుగుతున్న రోడ్డు పనులను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు. లాక్డౌన్ కారణంగా ట్రాఫిక్ తక్కువగా ఉన్నందున రోడ్ల నిర్మాణం, ఫ్లై ఓవర్ నిర్మాణలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగానే నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పలు చోట్ల రోడ్ల వెడల్పు, కొత్త రోడ్లు, పాత రోడ్లు నవీకరణ చేయటం జరుగుతుందని మంత్రి తెలిపారు. పనులను మరింత త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
'పనులను మరింత త్వరితగతిన పూర్తిచేయండి' - ఫ్లై ఓవర్ నిర్మాణాలు
లాక్డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటంతో అధికారులు రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ నిర్మాణాలను ప్రారంభించారు. ఈ పనులను, నాణ్యతను మంత్రి మల్లారెడ్డి పరిశీలించారు.
'పనులను మరింత త్వరితగతిన పూర్తిచేయండి'