తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథలకు సాయం చేసి మానవత్వం చాటుకున్న మంత్రి మల్లారెడ్డి - mallareddy helping orphans news

రంగారెడ్డి జిల్లా నూతనకల్​ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు.. తల్లదండ్రులను కోల్పోయి కష్టాల్లో ఉండగా.. వారికి మంత్రి మల్లారెడ్డి ఆర్థిక సహాయం చేశారు. వారికి అన్ని విధాలా సహాయపడతామని మంత్రి భరోసా ఇచ్చారు.

minister mallareddy helped orphan sisters at nutankal in rangareddy district
అనాథలకు సాయం చేసి మానవత్వం చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

By

Published : Nov 5, 2020, 5:07 PM IST

రంగారెడ్డి జిల్లా నూతనకల్​ గ్రామానికి చెందిన కురుమస్వామి, భార్య సరిత, కుమారుడు సాయిచరణ్​.. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో వారికున్న ఇద్దరు కుమార్తెలు.. పదో తరగతి చదువుతున్న శ్రీలేఖ, ఏడో తరగతి చదువుతున్న రుచిత అనాథలుగా మిగిలిపోయారు. వీళ్లకి ఉన్న నాయినమ్మకు పక్షవాతం రాగా.. కురుమస్వామికి ఉన్న భూమి కాగితాలు పెట్టి రుణం తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు బతకడమే కష్టంగా మారగా.. వారికి ఈ అప్పు ఓ గుదిబండగా మారింది.

శ్రీలేఖ, రుచిత విషయం తెలుసుకున్న పీఏసీఎస్ ఛైర్మన్​ సురేష్​రెడ్డి.. వీరి గురించి మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వారు అప్పు మొత్తాన్ని చెల్లించి.. బాధిత రైతు కుటుంబాన్ని ఇంటికి వెళ్లారు. వారికి పాస్​బుక్​లు, డాక్యుమెంట్లను మంత్రి అందజేశారు. భవిష్యత్తుతో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండిఃరాష్ట్రంలో రైతు వేదికలే దేవాలయాలు: మంత్రి మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details