Lbnagar Underpass: హైదరాబాద్ ఎల్బీనగర్ అండర్‌పాస్, బైరామల్‌గూడ పైవంతెనను.... ఇవాళ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ. 9.28 కోట్లతో ఎల్బీనగర్ అండర్‌పాస్, రూ. 28.642 కోట్లు ఖర్చుచేసి... బైరామల్‌గూడ పై వంతెనను నిర్మించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపర్చి ట్రాఫిక్ సమస్య లేకుండా సిగ్నల్ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేసేందుకు ఫ్లై ఓవర్లు, స్కైవేలు, మేజర్ కారిడార్లు, అండర్‌పాలను... ఎస్ఆర్డీపీ పథకం కింద జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది.
వరంగల్, నల్గొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా... ట్రాఫిక్ నియంత్రణకు అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ఆరాంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు... మూడులేన్లతో బైరామల్‌గూడ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.