రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కొత్తూర్ పురపాలికకు మంజూరైన నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. షాద్నగర్ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
షాద్నగర్ పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. విద్య, వైద్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ పలు పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడించారు. అందరి ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరారు.