త్వరలోనే ఆ ప్రాంతాలకు నీటి సరఫరా: మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథ పథకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తున్నామని శాసనసభలో (assembly sessions 2021) పురపాలక మంత్రి కేటీఆర్ (minister ktr) పేర్కొన్నారు. 313 కోట్ల 26 లక్షల రూపాయలతో 47 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించినట్లు స్పష్టం చేశారు. 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం ద్వారా ఎల్బీనగర్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాను (water supply) మెరుగుపరిచామన్నారు. మిలిగి ఉన్న కాలనీలకు త్వరలోనే తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ (minister ktr) వెల్లడించారు. నగర శివారులోని నియోజకవర్గాల్లోని అనేక కాలనీల్లో భూగర్భ మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రశ్న: అర్బన్ మిషన్ భగీరథ వివరాలు.. ఎల్బీనగర్ పరిధలో ఏవిధంగా అమలు చేశారు. వివరించండి.
- సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే
జవాబు: ఎల్బీనగర్ పరిధిలో 47 ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన రిజర్యాయర్లు నిర్మించాం.మిషన్ భగీరథ కింద మిగిలిన ప్రాంతాలకు త్వరలోనే నీటి సరఫరా చేస్తాం. నగర శివారు నియోజకవర్గాల్లోని అనేక కాలనీలపై దృష్టి సారిస్తాం. భూగర్భ మురుగు నీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
- కేటీ రామారావు, పురపాలక శాఖ మంత్రి
తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తాగునీటికి సమస్య ఉండకూడదనే.. ఉద్దేశంతోనే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. 90 నుంచి 95 శాతం వరకు తాగునీటి సమస్య పూర్తయిందని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రైతుబజార్, వైదేహీ నగర్, సచివాలయ నగర్, ఆటోనగర్, ప్రశాంతి నగర్, సాహెబ్ నగర్, వాసవీ నగర్‌కు సంబంధించి.. 47 ఎంఎల్‌డీల (47mld) సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు నిర్మించి నీటి సమస్యను తీర్చామని వివరించారు.
ఇదీచూడండి:kcr clarify on 3 acres to dalits: దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం