హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టే అనేక కంపెనీలు వచ్చాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్‌లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ప్రజలకు ఒక్కటే రెండు పడకల గదుల ఇళ్లే బాకీ ఉన్నాయని... అది కూడా నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆరేళ్లలో తెరాస అనేక అభివృద్ధి పనులు చేసిందన్న కేటీఆర్... ఫ్లై ఓవర్లు కట్టుకున్నామని, రోడ్ల సమస్య కొంత మేరకు పరిష్కరించున్నామని చెప్పుకొచ్చారు. భాజపా నాయకులు ప్రచారానికి వస్తే ఏం చేశారని నిలదీయాలని సూచించారు.
ఇక్కడ ప్రశాంతంగా ఉంది కాబట్టే... హైదరాబాద్‌కు అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు వచ్చాయి. భాజపా నాయకులు ప్రచారానికి వస్తే ఏం చేశారని నిలదీయండి. ఆరేళ్లల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమో రూ.25 వేలు ఇస్తామంటున్నారు. మీరు ఆగమాగం చేస్తామంటే... ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. హుషారు హైదరాబాద్. అర్హులకు ఎన్నికల తర్వాత వరద సాయం కచ్చితంగా అందిస్తాం.
--- మన్సూరాబాద్ రోడ్‌షోలో కేటీఆర్