KTR on youth summit: యువతలో సమాజం, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఎతైనా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో కన్హా శాంతివనంలో 3 రోజుల అంతర్జాతీయ యువజన సదస్సును కేటీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. యూనెస్కో, ఎంజీఐఈపీ, ఏఐసీటీఈ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్ పటేల్ హాజరయ్యారు.
లక్ష్యాలను నిర్దేశించుకొని యువతముందుకు వెళ్లాలని వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ డాక్టర్ అనంత దురైయప్ప, ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్, గాయకురాలు ఖతీజా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. పలు దేశాలు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన యవత, విద్యార్థులు తరలిచ్చారు. ఈ సందర్భంగా మూడు జంటలకు దాజీ సమక్షంలో వివాహం జరిగింది. ప్రపంచం పురోగమిస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రపంచానికి కావాల్సింది దయ, కరుణ అని తెలిపారు.
మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి. అందుకు ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. మా పాత్ర పరిమితంగానే ఉంటుంది. అయితే మేము ప్రోత్సహించేందుకు కృషిచేస్తాం. యువత విద్యార్థి దశలోనే సమాజంపట్ల అవగాహన కోసం పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకువస్తాం. వాళ్లో అభిరుచి, దయాగుణం, విలువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తాం.- కేటీఆర్, ఐటీశాఖ మంత్రి
స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ మహాత్మా గాంధీ బోధనలు ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నామని చెప్పారు. మెటీరియల్ గోల్స్ నిర్థేశించుకుని యువత ముందుకు వెళ్ళాలని సూచించారు. తెలంగాణకు హరితహారంలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. కొవిడ్-19 నేపథ్యంలో రామచంద్ర మిషన్, కన్హా శాంతి వనం నేతృత్వంలో దాజీ సేవలు అద్భుతమని కొనియాడారు. కన్హా శాంతి వనం సేవలు తెలంగాణకు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. యువతలో సమాజ శ్రేయత, నైతిక విలువలు వంటి పొందిస్తున్నారని ప్రశంసించారు.