తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రక్​డాక్ లాజిస్టిక్ పార్క్ గర్వకారణం: మంత్రి కేటీఆర్

హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ట్రక్​డాక్ లాజిస్టిక్ పార్క్​ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ పార్క్ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అక్కడ వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయని... 24 గంటల పాటు భద్రత ఉంటుందని తెలిపారు.

minister-ktr-inaugurated-truck-dock-logistics-at-batasingaram-in-rangareddy-district
ట్రక్​డాక్ లాజిస్టిక్ పార్క్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

By

Published : Jan 26, 2021, 8:23 PM IST

హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో పీపీపీ పద్ధతిలో అభివృద్ది చేసిన ట్రక్​డాక్ లాజిస్టిక్ పార్క్​ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. పార్క్​కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని జాతీయ రహదారి-65 సమీపంలో సమీకృత టౌన్ షిప్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో వాహనాల పార్కింగ్, డాకింగ్ సేవలతో పాటు, వ్యవస్థీకృత గిడ్డంగి, మినీ గోడౌన్లు, ఆహారం, వసతి, ఆరోగ్య సంరక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. 24 గంటల పాటు భద్రత ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:కనకరాజు రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడింపజేశారు: మంత్రులు

ABOUT THE AUTHOR

...view details