ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు 66వ జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. గచ్చిబౌలి పాలపిట్ట పార్కులో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మొక్కలు నాటారు. ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మంత్రి సూచించారు.
ముఖ్యమంత్రి పుట్టిన రోజున మొక్కలు నాటిన ప్రముఖులు - kcr birthdaty celebrations by Minister Indrakran Reddy
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పాలపిట్ట పార్కులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులతో కలిసి మొక్కలు నాటగా... గండిపేట జలమండలి పార్క్ ఆవరణలో ఎండీ దానకిశోర్ ఆధ్వర్యంలో 666 మొక్కలు నాటారు.
ముఖ్యమంత్రి పుట్టిన రోజుకు మొక్కలు నాటిన ప్రముఖులు
నగర శివారులో గండిపేట జలమండలి పార్క్ ఆవరణలో సంస్థ ఎండీ దానకిశోర్ ఆధ్వర్యంలో 666 మొక్కలు నాటారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ, డైరెక్టర్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. హరిత తెలంగాణలో భాగంగా అందరూ మొక్కలు నాటాలని దానకిశోర్ తెలిపారు.
ఇవీ చూడండి:సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ శుభాకాంక్షలు
Last Updated : Feb 17, 2020, 3:15 PM IST