తెలంగాణ

telangana

ETV Bharat / state

Errabelli on Pallepragathi: పల్లెప్రగతి అమల్లో నిర్లక్ష్యం తగదు: ఎర్రబెల్లి - palle pragathi works

Errabelli on Pallepragathi: పల్లెప్రగతి కార్యక్రమ అమల్లో నిర్లక్ష్యం తగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను హెచ్చరించారు. ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమ కార్యాచరణ ప్రణాళికపై అన్ని జిల్లాల డీపీఓలు, డీఆర్డీఓలతో హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పల్లెప్రగతి సాధించిన ఫలితాలతో పాటు ఐదోవిడత లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దేశానికి మన గ్రామాలే ఆదర్శంగా నిలిచాయని, ఆ ఆదర్శాన్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు.

Errabelli on Pallepragathi
Errabelli on Pallepragathi

By

Published : May 12, 2022, 4:59 AM IST

రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు అయిదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే గ్రామాల్లో ఉండాలన్నారు. డంపింగ్‌ యార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుధవారమిక్కడ పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాతో కలిసి జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పల్లె ప్రగతి కార్యక్రమాలతో దేశంలో ఉత్తమ, బహిరంగ విసర్జన లేని గ్రామాల కేటగిరీల్లో ఆదర్శంగా ఉన్నాం. ఆడిటింగ్‌లో నం.1గా కొనసాగుతున్నాం. దీర్ఘకాలంగా ఉన్న విద్యుత్తు సమస్యలు పరిష్కరించాం. హరితహారంతో రాష్ట్రంలో అదనంగా 7 శాతం పచ్చదనం మెరుగుపడింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో పచ్చదనం కోసం అనువైన ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలి. ఉపాధిహామీ పనుల కోసం జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి విభాగాల మధ్య సమన్వయం కొనసాగాలి. వైకుంఠధామాలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి. జిల్లా, డివిజనల్‌, మండల పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీలను తనిఖీ చేస్తూ, కార్యదర్శులకు మార్గనిర్దేశనం చేయాలి. పంచాయతీ కార్యదర్శులు సక్రమంగా విధులకు హాజరు కావాలి.-
ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details