కరోనా మహమ్మారితో రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.432కోట్లు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ప్రతి నెలా రూ.227.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో పంచాయతీలకు 210.44కోట్లు, మండల పరిషత్‌లకు 11.41కోట్లు, జిల్లా పరిషత్‌లకు 5.65కోట్లు చొప్పున అందిస్తున్నట్లు వివరించారు.
గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు రూ.432 కోట్ల 49 లక్షలు విడుదలయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీలకు రూ.182.49 కోట్లు కాగా, మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.