తెలంగాణ

telangana

ETV Bharat / state

విపక్షాలు గెలిస్తే అభివృద్ధి దిల్లీలో ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి - trs campaign in ghmc elections

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డు డివిజన్​లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు​ పర్యటించారు. కాప్రా సర్కిల్​ 4 వ డివిజన్​లో ఇస్త్రీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. తెరాస అభ్యర్థి ప్రభుదాస్​ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

minister errabelli campaign in meerpet
విపక్షాలు గెలిస్తే అభివృద్ధి దిల్లీలో ఉంటుంది: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Nov 25, 2020, 12:50 PM IST

కారు గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి మన చేతుల్లో ఉంటుందని, లేకపోతే అభివృద్ధి, సంక్షేమం దిల్లీలో ఉంటాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్​పేట్​ హౌసింగ్​ బోర్డులోని కాప్రా సర్కిల్​ 4వ డివిజన్​లో మంత్రి పర్యటించారు. ఇస్త్రీ చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

డివిజన్ అభ్యర్థి ప్రభుదాసును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఎర్రబెల్లి కోరారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి మాకు మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​, భాజపాలు నగరాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్లు దిల్లీ నాయకులను అడగాలి.. కానీ తెరాస గెలిస్తే మన గల్లీ నాయకులను అడిగితే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:గ్రేటర్​ పోరు... బల్దియా ఎన్నికల్లో ఈ ఓటర్లే కీలకం!

ABOUT THE AUTHOR

...view details