రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో 22 స్థానాలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. పురపాలికను కైవసం చేయడానికి ఎంఐఎం అభ్యర్థులకు మద్దతుగా యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ ప్రచారం నిర్వహించారు.
'జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎంఐఎంతోనే సాధ్యం' - జల్పల్లి పురపాలక ఎన్నికలు
జల్పల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ఎంఐఎం పార్టీ ప్రచారం వేగవంతం చేసింది. ఏఐఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ, యాకుత్పురా ఎమ్మెల్యేలతో ప్రచారం చేయిస్తోంది.
'జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి ఎంఐఎంతోనే సాధ్యం'
ఎర్రగుంట, బార మల్గి చుట్టుపక్క ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. భారీ మెజారిటీతో తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎంఐఎం అధినేత సాయంతో, 14 ఫైనాన్స్ ద్వారా రూ.17 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
- ఇవీ చూడండి: సిరిసిల్లలో నేను చేయాల్సిన పని ఇదే: కేటీఆర్