ఎట్టకేలకు మెగా డెయిరీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో మెగా డెయిరీ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. సర్వే నంబరు 1/1 ఐమర్త్ కంచలో పశుసంవర్థక శాఖకు చెందిన 32.20 ఎకరాల విస్తీర్ణం భూమిని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ - టీఎస్‌డీడీసీఎఫ్‌ఎల్‌కు కేటాయించింది.
అద్దె ప్రాతిపదికన ఈ భూమిని కేటాయిస్తూ పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రావిర్యాలలో పెద్ద ఎత్తున షీప్ బ్రీడింగ్ ఫాం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఆ పక్కనే ఈ భూమిని మెగా డెయిరీ కోసం కేటాయించిన దృష్ట్యా నెలకు ఎకరానికి 30 వేల రూపాయలు చొప్పున 99 ఏళ్లపాటు... షీప్ బ్రీడింగ్ ఫాంకు చెల్లించాల్సి ఉంటుంది.