తెలంగాణ

telangana

ETV Bharat / state

blood donation: పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజేంద్రనగర్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ హాజరై రక్తదానం చేసిన 300 మందికి ధ్రువపత్రాలు అందించారు.

Mega Blood donation Camp rajendra nagar
blood donation: పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

By

Published : Jun 6, 2021, 8:50 PM IST

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐబీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్​లో రాజేంద్రనగర్ పోలీసుల ఆధ్వర్యంలో.. సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆ శిబిరాన్ని ప్రారంభించారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వారి కోసమే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన సూచించారు.

రక్తదానం చేసిన 300 మందికీ ఏసీపీ సంజయ్ కుమార్ ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీఐ కనకయ్య, డీఐ పవన్ కుమార్, ఎస్సైలు శ్రీధర్ రెడ్డి, బసాని శ్వేతా, సమరం రెడ్డి, విట్టల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details