రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్లను వైద్య అధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. అనర్హులు నడుపుతున్న 4 క్లినిక్లకు తాళం వేశారు.
వైద్య అధికారి తనిఖీలు.. బయటపడ్డ నకిలీ క్లినిక్లు - Rangareddy District Latest News
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న క్లినిక్లను వైద్య అధికారిని డా.స్వరాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. నాలుగు గుర్తించి వాటికి తాళం వేశారు. నకిలీ వైద్యులతో క్లినిక్ నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీలో క్లినిక్ల తనిఖీ
జిల్లా వైద్య అధికారిని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్వోలు పల్లవి, దీన్ దయాల్ కలసి నకిలీ వైద్యులున్న విజయ క్లినిక్, శ్లోక హాస్పిటల్, రాజార్షి క్లినిక్, లక్ష్మి క్లినిక్లకు తాళం వేశారు. ఎలాంటి అర్హత ధృవ పత్రాలు లేకుండా నడిపితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొవిడ్ టీకా రెండో డోస్ వ్యాక్సినేషన్ షురూ